AP: త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా బేతపల్లిలో విద్యుత్ కాంప్లెక్స్‌కు ఆయన భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం టాటా ఎనర్జీ, టీసీఎస్ సహా అనేక సంస్థలు పెట్టుబుడులు పెడుతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.