కర్నూలులో త్వరలోనే ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. లోకాయుక్త, ఏపీ హెచ్ఆర్సీ తదితర సంస్థలు కూడా కర్నూలులోనే ఉంటాయని, వాటిని వేరే చోటికి తరలించమని వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడిందని, కానీ తాము కర్నూలు, విశాఖపట్నంలోనూ అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు క్లస్టర్ల కోసం ఇప్పటికే రూ.5వేల కోట్లు కేటాయించామని వివరించారు.