సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు

85చూసినవారు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై నమోదైన స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగానే వీరు మీడియా సమావేశం నిర్వహించారని హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రెస్‌మీట్ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించి.. విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్