AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, DGPలను ఆదేశించింది. ప్రవీణ్ మృతిపై దర్యాప్తును CBIకి అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ప్రవీణ్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు.