AP: కర్నూలులో బెంచ్ ఏర్పాటుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం తమదే అని హైకోర్టు స్పష్టం చేసింది. 'అక్కడ బెంచ్ ఏర్పాటు అవసరం ఉందో.. లేదో.. అధ్యయనం చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో నివేదిక తెప్పించుకున్నాం. బెంచ్ ఏర్పాటు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తాం. అయినా, ఇంకా ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు కదా, అప్పుడే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు?' అని ప్రశ్నించింది.