హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను హిందువులు బహిష్కరించాలని ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఆదివారం పేర్కొన్నారు. "వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం సినిమా. ఈ రెండింటినీ జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోంది. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలి. లేదంటే హిందువులే పూర్తిగా వాటిని బహిష్కరించాలి. అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయి." అని ఆయన అన్నారు.