కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇస్తూ.. జీ నెట్‌వర్క్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ మధ్యే జీ కన్నడ ఛానెల్ లో 'మ్యాక్స్' మూవీ త్వరలోనే అంటూ ఓ ప్రోమో తీసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. .