‘కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి’ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్-6 అమలు చేశారా? పేదలకు ఏమైనా బటన్ నొక్కారా? అని ప్రశ్నించారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వకపోగా.. 2 లక్షల ఉద్యోగాలు తీసేశారన్నారు. ప్రభుత్వం వచ్చాక ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. వాలంటీర్లను మోసం చేసినట్లు ఉద్యోగులనూ చేస్తున్నారన్నారు.