ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు అధికారులు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపు (గురువారం) కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ల ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.