టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కాళ్లకు హోం మంత్రి అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నమస్కరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమానికి హాజరవుతున్న బాలయ్యను ఆహ్వానిస్తూ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. బాలయ్యపై అభిమానంతో హోం మంత్రి అనిత, మంత్రి సవిత కాళ్లకు నమస్కరించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.