హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి: రోజా

65చూసినవారు
హోంమంత్రి అనిత రాజీనామా చేయాలి: రోజా
AP: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత పనితీరుపై మండిపడుతూ.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ లేదని, హోంమంత్రి అనిత వారిని కాపాడలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. హోంమంత్రి పదవి అనితకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్