AP: నరసరావుపేట బైపాస్ రోడ్డు వద్ద సోమవారం బైక్ ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత ప్రమాదాన్ని గమనించారు. తన కాన్వాయ్‌ను ఆపి బాధితుల దగ్గరికి వెళ్లారు. గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.