AP: నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఇందులో భాగంగా మహానాడు నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ దాడిలో అమరులకు నివాళులర్పించడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు.