ఆరోగ్యంతో పాటు సౌందర్య పరిరక్షణలో కూడా తేనె ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గాయాలు, మచ్చలను తగ్గించడంలో తేనె బాగా సహాయ పడుతుందని వివరిస్తున్నారు. కాలిన గాయాల పైన తేనెను రాయడం వల్ల మచ్చలు పడవని చెబుతున్నారు. మొటిమల మీద తేనెను రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయని.. ఇంకా మొటిమల మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయని నిపుణులు అంటున్నారు.