విమాన సర్వీసుపై గంటా అసహనం.. TDP హైకమాండ్ సీరియస్

59చూసినవారు
విమాన సర్వీసుపై గంటా అసహనం.. TDP హైకమాండ్ సీరియస్
విమాన సర్వీసుల తీరుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ” అంటూ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. విశాఖ నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరిన విమానం, హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించి అమరావతికి మధ్యాహ్నం 1 గంటకి చేరిన విషయాన్ని గంటా చెప్పడంతో, పార్టీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసింది. 'ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి. విమానయాన శాఖ మంత్రి మనవారే కదా.. రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేయొచ్చు కదా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్