AP: రాష్ట్రంలో ఉన్న పేదలకు మంత్రి పార్థసారథి శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ పురోగతిపై సమీక్షించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు. జిల్లా అధికారులు నిత్యం లేఅవుట్లలో ఉండి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక అందుబాటులో ఉండాలన్నారు. లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.