పవన్, బాలకృష్ణ షూటింగ్స్ ఎలా చేస్తారు: రోజా

3చూసినవారు
పవన్, బాలకృష్ణ షూటింగ్స్ ఎలా చేస్తారు: రోజా
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ.. పవన్, బాలకృష్ణ ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లారని ప్రశ్నించారు. తాను ఏం చేశానో చెప్తానని, దీనిపై పవన్, బాలకృష్ణ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. తాను జబర్దస్త్ చేస్తే తప్పు అయినప్పుడు.. వాళ్లు షూటింగ్స్ ఎలా చేస్తారని విమర్శించారు. షూటింగులు చేయడానికి ప్రజలు ఓట్లు వేశారా? అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్