దక్షిణకొరియాకు చెందిన హ్యుందాయ్ కార్ల కంపెనీ కొత్త కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించినట్లు తెలిపింది. ఎస్‌యూవీ విభాగంలో అనేక కార్లపై రూ. 40 వేల నుంచి రూ. 68 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించినట్లు వెల్లడించింది. 2024లో మిగిలిపోయిన స్టాక్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది.