AP: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయాయి. దాదాపు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం 87,347 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,490 మంది భక్తులు తలనీలాలు చెల్లించుకున్నారు. స్వామివారి ఆదాయం రూ.3.13కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.