ఏపీ ప్రభుత్వం అనర్హుల పింఛన్‌ల ఏరివేతపై ఫోకస్ పెట్టింది. ప్రతీ నెలా లక్షల మంది అనర్హులు మనీ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. జనవరిలో దివ్యాంగులకు మళ్లీ వైకల్య పరీక్షలు జరిపించి.. 92వేల మంది అనర్హులను గుర్తించింది. అలాగే ఫిబ్రవరి 1న 63,59,907 మందికి పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయగా.. అనర్హులు అనుకున్న వారికి పెన్షన్లు ఇవ్వలేదు. దాంతో.. ఫిబ్రవరిలో 62,43,843 మందికే పెన్షన్ అందింది. ఇంకా 1,16,064 మందికి పెన్షన్ రాలేదు. 10 రోజులైనా పెన్షన్ రాలేదు కాబట్టి.. ఇక వారికి పెన్షన్ రానట్లే.