అమెరికాలో తుపానుల కారణంగా విపత్కర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రకృతి ప్రకోపానికి 21 మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కెంటకీలో 14 మంది, మిస్సోరీలో ఏడుగురు ఉన్నారు. కెంటకీలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గవర్నర్ ఆండీ బేషియర్ తెలిపారు.