AP: భార్య గొడవ పడుతుండటంతో విసిగిపోయిన భర్త ఆమెను రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. బాలాజీనగర్‌కు చెందిన ఎల్.విజయ్ చంద్ర, శైలజ (46) దంపతులు. విజయ్ చంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. భర్తపై అనుమానం పెంచుకున్న శైలజ తరచూ గొడవ పడేది. దాంతో ఆగ్రహానికి గురైన విజయ్ చంద్ర రోకలిబండతో శైలజ తలపై మోదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.