AP: భార్య మృతి చెందిందన్న మనోవ్యధతో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప గ్రీన్సిటీకి చెందిన దాలిపర్తి చిన్నఆదిశేషు(73) భార్య సరళ రెండేళ్ల కిందట మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన మనోవేదనతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.