కేరళలోని పిరవం ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి 40 అడుగుల బావిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన భార్య సమయస్పూర్తితో అతడిని కాపాడేందుకు పెద్ద సాహసమే చేసింది. మొదట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి.. తాడు సాయంతో బావిలోకి దిగి సృహ కోల్పోయిన భర్తను గట్టిగా పట్టుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వారిని క్షేమంగా పైకి లాగారు. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.