విశాఖపట్నం నగరంలోని రెడ్డి కంచరపాలెంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణంగా భావిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.