మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన జరిగింది. తన నుంచి విడిపోయిన 36 ఏళ్ల భార్య మెడపై కొడవలి పెట్టి బెదిరించి, అత్యాచారం చేశాడు. ఆపై పసుపు, కుంకుమ పూసిన నిమ్మకాయ ముక్కలను ఆమె ప్రైవేట్ భాగాలపై పిండి చిత్రహింసలకు గురి చేశాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. తన ఇద్దరు పిల్లల పుస్తకాల కోసం ఆమె తన భర్త ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినట్లు తెలుస్తోంది. "నీపై మంత్రం ప్రయోగించాను.. పిచ్చిదానివి అవుతావని," అని అతడు తన భార్యతో చెప్పాడు.