ఆ రోజే మానసికంగా చచ్చిపోయా: పేర్ని నాని

50చూసినవారు
ఆ రోజే మానసికంగా చచ్చిపోయా: పేర్ని నాని
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో వైసీపీ శ్రేణులతో గురువారం పేర్ని నాని మాట్లాడుతూ.. ‘రేషన్ బియ్యం కేసులో నా భార్యను తీసుకుని 15 రోజుల పాటు దాక్కుంటూ తిరిగాను. ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోయాను. అదృష్టవశాత్తూ బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు వదలకుండా నా భార్యను విచారించారు.’ అని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్