పాకిస్థాన్‌పై దౌత్య యుద్ధానికి విదేశాలకు పంపే బృందంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై శశి థరూర్ స్పందిస్తూ.. 'నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఇటీవల జరిగిన పరిణామాలపై అంతర్జాతీయ వేదికపై భారత్ గళాన్ని బలంగా వినిపిస్తా. దేశానికి నా సేవలు అవసరమైనప్పుడు ఏమీ ఆశించబోను' అని Xలో ట్వీట్ చేశారు. కాగా విదేశాలకు 7 భారత ప్రతినిధి బృందాలను కేంద్రం పంపనుంది.