తనకు ‘బాలీవుడ్’ అనే పదం నచ్చదని, హిందీ సినిమా అని పిలవడమే ఇష్టమని అల్లు అర్జున్ అన్నారు. పుష్ప-2 థాంక్స్ మీట్‌లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్రమత్తమైన నిర్మాత రవిశంకర్ 'బాలీవుడ్' వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలని బన్నీకి చెవిలో చెప్పారు. దీంతో ఆయన తనకు ఆ పదం మాత్రమే నచ్చదని క్లారిటీ ఇచ్చారు. పుష్ప-2 కోసం ఓ హిందీ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఆ మూవీ టీమ్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పానన్నారు.