టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సవ్యాసాచీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'రాజా సాబ్' సినిమాల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మణిరత్నంకు వీరాభిమానినని, సఖి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. మాధవన్, షాలినిల మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా నచ్చాయని.. ఆ మూవీని ఎన్నిసార్లు చూశానో లెక్క లేదని తెలిపింది.