AP: ‘నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే ఇంటర్‌నెట్‌లో పెడతా‘ అంటూ యువతిని బెదిరించి ఓ యువకుడు రూ.2.53 కోట్లు కాజేశాడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఓ యువతి HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. స్నేహితురాలి భర్తగా పరిచయమైన నినావత్ దేవనాయక్ ఆ యువతికి ఫోన్ చేసి పై విధంగా బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. చివరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పట్టుకున్నారు.