
పాలకూర తినడం వలన ఎన్నో ప్రయోజనాలు
పాలకూరతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకు కూరలో తక్కువ కేలరీలు, అధిక పోషక విలువలు ఉంటాయి. అందుకే పాలకూరను ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం అని అంటారు. పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ A కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును తగ్గిస్తుంది.