తాను ఎక్కడికీ పారిపోలేదని జనసేన నేత కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో ప్రకటన చేశారు. "నాపై దుష్ప్రచారం చేయడానికి వైసీపీ పేటీఎం డాగ్స్ చాలా కష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వాస్తవాలు కాదు. ఆ ఆడియోలను కోర్టుకు సమర్పించాను. నేను న్యాయస్థానంలో తేల్చుకుంటాను. నా దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయి. వాటిని కోర్టుకు సమర్పిస్తాను" అని కిరణ్ పేర్కొన్నారు.