ముంబై వాంఖడేలో స్టాండ్‌కు తన పేరు పెడతారని ఎప్పుడూ ఊహించలేదని రోహిత్ శర్మ పేర్కొన్నారు. "వాంఖడే గొప్ప స్టేడియం. దీనితో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల మధ్యలో నా పేరు ఉండటాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఇందుకు ముంబై క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు. భవిష్యత్‌లో వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరఫున వాంఖడే స్టేడియంలో ఆడాలనుంది." అని రోహిత్ పేర్కొన్నారు.