ఇటీవల పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడడం కలకలం రేపింది. త్రుటిలో మాజీ అధ్యక్షుడు ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా ఈ ఘటనపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఓ మహిళ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు. ఈ సందర్భంగా ఆ మహిళను వేదికపైకి పిలిచి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, ధన్యవాదాలు తెలియజేశారు.