AP: నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో టీడీపీ కార్యకర్తలతో నిన్న మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘వైసీపీ పాలనలో నన్ను జైలుకు పంపారు. భార్య, పిల్లలను పక్కనపెట్టి కార్యకర్తల కోసం ప్రాణాలకు తెగించి ధైర్యంగా నిలబడ్డా. ఎప్పుడూ భయపడలేదు. మీరు చూపిన ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.’ అని ఎమోషనల్ అయ్యారు.