AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. సీఎం చంద్రబాబుతో పాటు పోలీసులను కూడా బోనెక్కిస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన్యాయాల్లో పోలీసులు భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు పోలీసులు కూడా శిక్ష అనుభవించాలని హెచ్చరించారు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండరని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా అంటూ పేర్కొన్నారు.