జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన అభిమానులను వ్యక్తిగతంగా కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం త్వరలోనే ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ బృందం స్టేట్‌మెంట్ విడుదల చేసింది. తనను కలుసుకోవడానికి పాదయాత్రల్లాంటివి చేయొద్దని నటుడు ఎన్టీఆర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అన్ని అనుమతులు తీసుకుని ఈవెంట్ నిర్వహించడానికి కొంత టైం పడుతుందని, అప్పటివరకు ఓపికతో వేచి ఉండాలని తెలిపారు.