ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారిణి, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి సెలవుపై వెళ్లారు. పది రోజుల పాటూ వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నారు. ఆమ్రపాలి బాధ్యతల్ని కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమ్రపాలి ఇటీవల తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.. ఏపీలో రిపోర్ట్ చేయగా ఆమెకు పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ నెల 6న ఆమె బాధ్యతలు స్వీకరించారు.