ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మంటల్లో చిక్కితే కంగారుపడకుండా దగ్గరలో ఉన్న అత్యవసర ద్వారాలను గుర్తించాలి. మంటలను ఆర్పే ఉపకరణాలు ఉంటే వాటితో బయటపడేందుకు ప్రయత్నించండి. పొగ ముసురుకుంటే తడి వస్త్రంతో ముఖం కప్పుకుని బయటకు రావాలి. నూనె ఉత్పత్తుల వైపు వెళ్లొద్దు. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా నేలపై దొర్లండి లేదా దుప్పటి చుట్టుకోండి.