AP: పాకిస్థాన్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు మా దేశంలోకి వచ్చి కొడితే.. మేము మీ ఇంట్లోకి దూరి కొడతాం’ అని పాక్‌ను హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌ను ఎలాగైనా వెనక్కి నెట్టాలని, దేశ అభివృద్ధిని ఆపాలని పాక్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై దాడి చేస్తే బలమైన జవాబు చెప్పాలన్నారు.