ఏపీ మాజీ జగన్‌కు హామీలపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. హామీలు అమలు చేస్తే 11 సీట్లే ఎందుకు వచ్చాయో.. జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని సోము హితవు పలికారు. తిరుమల లడ్డూ కల్తీ గుర్తించి మాట్లాడే ముందు.. రూ.350కి కిలో నెయ్యి ఎలా వస్తుందో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు.