జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ కంటే కేసీఆరే నయం అని పేర్కొన్నారు. బీసీల పేరుతో రేవంత్ రాజకీయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుంటే సంకుల సమరమే అంటూ హెచ్చరించారు. ‘మీరు చట్టం చేయండి.. మేం సుప్రీంలో కొట్లాడుతాం’ అంటూ వ్యాఖ్యానించారు.