ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే జమిలీ ఎన్నికలను తీసుకురావాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీని వల్ల ఏపీలో రాజకీయాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు వస్తే బీజేపీ, జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. అప్పుడు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయమని జన సైనికులు భావిస్తున్నారు.