మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం బయటపడింది. బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మహిళల ప్రైవేటు వీడియోలను రికార్డు చేసి వాటితో బెదిరిస్తూ.. పలుమార్లు వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే భయపడకుండా పోలీసు స్టేషన్‌కు వచ్చి అతడిపై ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేస్తున్నారు.