సాటి మహిళలకు రక్షణ కల్పించడం లేదంటే సిగ్గుపడాలి: రోజా (వీడియో)
మాజీ మంత్రి రోజా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ సాటి మహిళలకు రక్షణ కల్పించలేకపోతే సిగ్గుపడాలని విమర్శించారు. తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఒక చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును పోలీసులు మూసివేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు.