ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు చర్చలు పూర్తైయినట్లు చెబుతున్నారు. ఉండవల్లి ఈనెల 26 తరువాత వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.