ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు: భూమన

66చూసినవారు
ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమ అరెస్టులు: భూమన
AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అక్రమంగా అరెస్టులు చేస్తోందన్నారు. వైసీపీ అధినేత జగన్‌ను బలహీనపరిచేందుకే వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్