రాష్ట్రంలోని ఇమామ్, మౌజన్‌లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారి గౌరవ వేతనాలను విడుదల చేసింది. 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మొత్తం రూ.45 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మౌజన్‌లకు నెలకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనాలను అందుకోనున్నారు.