డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లు ప్రకారం.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ యూజర్ల డేటా గోప్యతను కాపాడలేకపోయినా, సమాచార దుర్వినియోగానికి పాల్పడినా రూ.50 కోట్ల నుంచి గరిష్టంగా రూ. 250 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. దీన్నిబట్టి ఈ చట్టం ఎంత కఠినమైందో, వ్యక్తిగత డేటా ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు.